వరమియ్యరా వక్రతుండా…

వరమియ్యరా వక్రతుండా…
కొలుచునటుల నిత్యమూ నిను వదలకుండ….
ఉండిపోతే మా కలల నిండా….
మరచిపోగలమటరా..బంగారుకొండ!!వర!!

నీ ముద్దు మోమును గనిన క్షణమున….
ప్రేమ పెరుగును ఎవరికైనా…
సరిహద్దులెరుగని భక్తి వలన…
స్నేహితునివవుతవు ఏ ప్రాణికైనా…

భక్తితో ముడిపడిన బంధము కానే కదయా ఇది గణేశా….
ఏ పేగు బంధము పంచని ప్రేమ పంచే నీ గొప్ప మనసుకి సాక్ష్యమే ఇదయా గణేశా…
బాల గణపతివై రావయ్య  ఒకసారి హత్తుకొనగా….
మా జన్మ ధన్యమవదా నీ చిన్ని పాదాలతో మా గుండెపై తన్నగా…

పాహిమామ్..పాహిమామ్..గణనాయకా…
రక్షమామ్..రక్షమామ్..విఘ్న వినాయకా…

Leave a Comment

Scroll to Top