వేడితిమయ్యా గణనాధా….
నిను కోరితిమయ్యా గణనాధా….
కలుగకుండా ఏ ఆటంకమూ…
జరిపించమని మా ప్రతి కార్యము…
శంభో శంకర గణనాధా…
శివ శంభో శంకర గణనాధా…
సాంబసదా శివ గణనాధా…
శివ సాంబసదా శివ గణనాధా..!!వేడి!!
నీ అనుమతినే కోరిన వెంటనే…
పడునే అడుగులు వడివడిగా నిను తలవగనే…
కలగా మిగిలిన కోరికలే…
నిజమై పోవును అది నీ పూజా మహిమల విశేషములే…
శంభో శంకర గణనాధా…
శివ శంభో శంకర గణనాధా…
సాంబసదా శివ గణనాధా…
శివ సాంబసదా శివ గణనాధా!!వేడి!!
వ్యాస మహర్షి మదిగెలిచిన విద్య వినాయకుడివి…
సునాయసముగ మహా భారత చరితము లిఖించిన వాడివి…
దశకంఠుడినే ఏమార్చిన వాడివి…
ఆత్మలింగమును గోకర్ణము కడ పుడమి ఒడిచేర్చినవాడివి…
నీ లీలలు చెప్పగా మా తరమా శంభో శంకర గణనాధా…
అవలీలగా తిను కుడుములు లాగా మా వెతలను తీర్చర గణనాధా….
శంభో శంకర గణనాధా…
శివ శంభోశంకర గణనాధా…
సాంబసదా శివ గణనాధా…
శివ సాంబసదా శివ గణనాధా…