ఓమ్ నమ:శ్శివాయ నమ:


వందే గణపతిం..శివం..శివం
వరమొందే క్షణమిది నిజం..నిజం…
రూపం మంగళకరం..శుభం..
ఆ కాంతులు ఎంతో శుభంకరం..
శివ శివ శంకర గణనాధా…
ప్రియ శాంకరీ పుత్రా గణనాధా…!!వందే!!
మూషికమాయెను నీ వాహనము
మోయగ నీ పెను భారమును…
అచ్చెరువవ్వును మీ సాంగత్యము..
నీమది గెలిచిన ఎలుకకు కాదా సాధ్యము…
శివ శివ శంకర గణనాధా…
శివశంకర తనయా గణనాధా…!!వందే!!
కైలాసానా కొలువుండి…
కొమరయ్యకు తోడుగ నువ్వుండి…
కనరా భువిని దివినుండి…
మీ చెలిమికి మీరే సాటని చాటగ పైనుండి….
శివ శివ శంకరా గణనాధా…
శివ మానస పుత్రా గణనాధా…!!వందే!!
పాహీ…పాహీ…గణనాధా…
మాం..పాహీ…పాహీ గణనాధా…