ఓమ్ నమ:శ్శివాయ నమ:


అవంతికాపురవాసి..పార్వతీ హృదయ నివాసి…
కనులు తెరిపించును మన తప్పులను సరిజేసి…
వేయకండి..పెడదారి పట్టి తప్పటడుగూ నంటూ…
మోయకండి…పాపాల మూటలని జీవితాంతమూ అంటూ…!!అవంతి!!
శంకరారాధనలో లీలమవమని చెప్పును….
భక్తిభావనతో తనతో మమేకమవమని చెప్పును…
జరుగునని ఎన్నెన్నో అద్భుతాలు మన జీవితాలలో….
మార్పులు కలుగునని ఆ బ్రహ్మ రాసిన తలరాతలలో…!!అవంతికా!!
దివ్యసొగసులతో వెలుగొందు శివలింగము ముందు నిలిచుకొని…
ఆత్మసాక్షిగా చేసిన మన తప్పులను కన్నీళ్ళతో చెప్పుకొని…
మన్నించరా శంకరా అంటే…ముదమవుదుము మనము తనకు….
తప్పులెంచకురా పరమేశ్వరా అంటే…కన్నీరు తుడిచి గుండెకు హత్తుకొని ఔదార్యమే పంచు మనకు…!!అవంతిక!!
పాహిమాం…పాహిమామ్..శివశంకరా..
రక్షమామ్…..రక్షమామ్….అభయం