ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఎనలేని ఆ దివ్య సౌందర్యము…
ఎక్కడలేని ఆ ప్రేమ ఔదార్యము….
నీకొక్కడికే చెల్లునయా శంకరా…
మా మొక్కులివే అందుకోవయ్య శంకరా…!!ఎనలేని!!
సురులు నిలబడి ప్రార్ధించగా…
బ్రహ్మ, విష్ణువులు శ్లాఘించగా…
పంచభూతాలు ముకుళిత హస్తములతో..
ప్రమదగణములు ఢమరుక నాదాలతో…
కైలాసమే వెలిగే శతకోటి చంద్రికల తేజస్సుతో…
ఈ విశ్వమే మెరిసే పరమేశ్వరా నీ చిరునవ్వుల ఉషస్సుతో…
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా.
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్..