హరి హరుల మానస మాసము…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

హరి హరుల మానస మాసము…
ఈ కార్తీక మాసము…
శివకేశవ దర్శనము…
కలుగుటయే బాగ్యము…
అడగకనే ఇచ్చిన ఈ వరమును..
పొందిన మన జన్మధన్యమవునుకదా..అవును!!హరి!!

ధ్యానించును శివుడు…శ్రీ లక్ష్మీపతిని….
హరి తాను స్మరియించును..శ్రీ గిరిజా పతిని…
దేవ దేవుళ్ళిద్దరూ…ఏక హృదయులు…
రెండు కళ్ళు వాళ్ళిద్దరూ…లోకానికి ప్రియులు…
నమో..నమో..నారాయణ..హరోం..హరా శంకరా…
కలే తీరే మిమ్ముగని ఒకేసారి హరి, హరా..!!హరి!!

పాలకడలి వేదికపై పద్మనాభుడు…
హిమగిరి నగములపై ఆశీనుడై కైలాస నాధుడు…
ఒకరికొకరు ఎనలేని కరుణ హృదయ మనస్కులు…
క్షణము తీరికైన తీసుకోని భక్తజనుల పాలకులు…!!హరి!!

పాహిమాం…పాహిమాం..శివకేశవ పాహిమాం..
రక్షమాం..రక్షమాం..శివ హరి రూపాయ రక్షమాం..

Leave a Comment

Scroll to Top