ఆలసించక వేగమేరా..ఆదిశంకరా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఆలసించక వేగమేరా..ఆదిశంకరా…
అర్రులుచాచివున్నవి మా కనులు శీఘ్రముగ రా..
నీ సందర్శనమునకై వేచిఉన్నవవి..
నీ వీక్షణముకై కాచుకొని ఉన్నవవి…!!ఆలసించక!!

వినరా శంకరా… రెప్పలు తెరిచిన తలుపుల చప్పుడు…
నీకై పలికే స్వాగతద్వారపు శబ్దము అది…దర్శనమియ్యగ రా రా త్వరపడు..
తహ తహ లాడుతు ఉన్నాయి మా కన్నులు రెండూ నిను దర్శించి త్వరగా స్పందించాలని….
ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్నాయి స్పందించి.. నీ శుభ దీవెనల సంకేతాలను మాకందించాలని..!!ఆలసించక!!

తడి కన్నులు తెలిపెను వినయముతో కృతజ్ఞతలు మాకు…
పరమాత్మా నిను చూసిన భాగ్యము తమకు కలిగించినందుకు…
ఒక్కటే మాట మాతోటి మా కళ్ళు అన్నవి….
ఏజన్మ పుణ్యమో మీ రెండు కళ్ళు మేమయిన మన్నవి…
చూస్తుంటే మాలోని ఒక్క అవయవము స్పందించిన తీరు…
ఈ సంపూర్ణ దేహమూ, ఆత్మ ఋణ పడి తప్పక నీ పాదాలు చేరు…

పాహిమామ్…పాహిమామ్..శివశంకరా.…పాహిమాం
రక్షమామ్..రక్షమామ్..
అభయంకరా… రక్షమామ్..

Leave a Comment

Scroll to Top