ఓమ్ నమ:శ్శివాయ నమ:


సరితూగగలనా శంకరా…
నిను కీర్తించగా నేను సరితూగగలనా శంకరా…
మదినాపగలనా హర హరా…నిను గాంచి తరియించి నాల్గు పదములైన వ్రాయమను కోరు నామదినాపగలనా హర హరా…
గంభీర సౌందర్య గంగాధరా…
సుమధుర దరహాస శివశంకరా…
చెప్పరా..శంకరా..సాధ్యమా వ్రాయంగ ఈ కరముకు…
సాగునా..నీ కరుణ లేకున్న అది ముందుకు….!!సరి!!
నిను దర్శించగనే పుట్టేను నాలోన భావాలు ఎన్నెన్నో…
పాళి పట్టగనే పరుగిడును భక్తి పద కవితా కుసుమాలు ఎన్నెన్నో…
అందుకో శంకరా ప్రేమతో అక్షర సుమ శతకములు…
చదువుకో హరహరా ఆర్తితో వ్రాసి నీకర్పించిన భక్తి సిరాక్షతలు…!!సరి!!
కనులపండువుగా నున్న నీ మోము చూచి…
నీ ఎదుట నిలిచాను రెండు కరములు చాచి…
కరుణించి కాపాడరా…జలచర,భూచర,వాయుచర సమస్తప్రాణికోటిని…
దీవించి దయచూడరా…భూతలాన నివసించు అనంత జీవరాశిని…
స్వార్ధమనుకోకు శంకరా…నీ దృష్టిలో, సృష్టిలో మేము అణువులం…
ఏ కొమ్మకైన పూసి నీ పాదాల చెంత చేరాలనుకునే పువ్వులం….
పాహిమామ్…పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా