ఓమ్ నమ:శ్శివాయ నమ:


శ్రీ విశ్వనాధుని వైభవమును మనసారా కనరారే….
దివ్యతేజముల హరివిల్లులెన్నెన్నో తన లోన అలరారే…
ధన్యోశ్మి శంకరా.. అంటూ దండాలు పెడుతూ…
మనసాస్మరామి అంటూ శిరమొంచి మొక్కుతూ…
అడుగులేయండి ఆ స్వామి గుడివైపుకు…
పరుగులెట్టండి పరమేశ్వరుని కరుణా వీక్షణముల కొరకు…!!విశ్వ!!
యుగయుగాలుగా పూజింపబడుతూ….
తరతరాలుగా శ్లాఘించబడుతూ..
ధరణిలేలే దాక్షాయాణి వరుడు…
ముక్తి నొసగ మన కొరకు వేచివున్నాడు…
రండి..రండంటూ..ప్రేమతో పిలుచుచున్నాడు…!!విశ్వ!!
తేరిపారా చూడండి తన కళ్ళని..
చూడొచ్చు మనము… తనకు మనపైనున్న ప్రేమని…
ధ్యానించి చూడండి అతనిని…
ఆ చూపులో కనిపించు ఋతు కాలమెరుగని ఆశీస్సుల ఆమని…
కాలాన్ని శాసించు శ్రీ కాళేశ్వరుడు సైతము…
ఇవ్వకుండ ఉండలేడు… తన మదిని గెలిచిన భక్త మహర్షికి కైవల్యము…
ధారాళముగా దయచూపు దేవుడండి…
భూరీ విరాళముగా మనకిచ్చు తాను వరములండి…
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా.
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..