సర్వశుభముల నిచ్చు  గౌరి శంకరా….

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

సర్వశుభముల నిచ్చు  గౌరి శంకరా….
సకలమూ సమకూర్చు  ఆదిశంకరా…
భక్తిమీరగా కోరితే కాదనవుగా ఏమడిగినా….
శక్తికొలదీ వేడితే ఇచ్చేవుగా పరమ పావనమైన నీ విభూతినైనా..!!సర్వ!!

ఈశ్వరా…నీ వాత్సల్యమధురిమలెంత రుచిరా..
పరమేశ్వరా…నీ నామస్మరణములంత శుచిరా…
బోధపడని ఛాందసులలో…
పరమార్థమెరుగని మూర్ఖులలో…
మబ్బుతెరలను తొలగించరా…
నీ జ్ఞానజ్యోతిని వెలిగించరా…!!సర్వ!!

దాచుకొని వుంటేను చాలు నీ రూపమును మా గుండెలో…
ఆశీనుడివై ఉంటావు..కాపాడగా కలకాలము…
ప్రార్ధించుకుంటుంటే చాలు..నీ నామస్మరణము మా మనసులో…
పరిపాలించినట్లుంది మా మది నుండి కైలాసము…
ఇంతకంటే దివ్య భావము ఇంకేముంటుంది శంకరా…
మా మది నీ స్థిర నివాసము చేసుకొన రమ్మంటుంది శంకరా…!!సర్వ!!

పాహిమాం..పాహిమాం..పరమేశ్వరా..పాహిమాం….
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా..రక్షమాం…

Leave a Comment

Scroll to Top