శుభము ఒక కన్నుగా….

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

శుభము ఒక కన్నుగా….
లాభము ఒక కన్నుగా…
వెరశి శుభలాభములనిచ్చు శ్రీ లక్షీగణపతీ….
పంచమీ శుభతిధిన ప్రసరించరా నీ కరుణ కిరణాలు విధించక పరిమితి…!!శుభము!!

ఓంకార రూపుని ఓ ముద్దుబిడ్డా…
మా గౌరమ్మ తల్లి గారాల బిడ్డా…
నిండు మనసుతో మేము కొలిచేమయా…
నీ రెండు కనులతో మమ్ము దయ చూస్తే చాలయా….!!శుభము!!

వీరగణపతివి నీవు…
ధీర గణపతివి నీవు…
శక్తి గణపతివి నీవు…
ముక్తి గణపతివి నీవు…
శ్రేష్ఠ గణపతివి నీవు…
ద్రిష్టి గణపతివి నీవు…
మోక్ష గణపతివి నీవు…
మా సంపూర్ణ రక్ష గణపతివి నీవు…

పాహిమామ్..పాహిమామ్..పార్వతీ తనయాయ….పాహిమాం..
రక్షమాం..రక్షమామ్..గణనాయకా రక్షమాం…

Leave a Comment

Scroll to Top