ఓం నమ:శ్శివాయ నమ:


మలచుకొందువు గణేశా….
మూర్తివై
నిన్ను నీవే ఏ గీత గీసినా…
తలచుకొమ్మని చెప్పేవు సూక్ష్మ నయనా…
నీ బొమ్మగా అది ఏ తీరునైనా…!!మలచు!!
క్షణములో నీ చిత్తరవు తీరులాగా…
అరక్షణములో నీ రూపు అనిపించులాగా..
ఒదిగిపోతావయ్య మునివ్రేళ్ళతోనే…
చూసిమురిసిపొమ్మని మా కళ్ళతోనే..!!మలచు!!
ఎంత సంతసమో నీ పూజలంటే ప్రతివారికీ…
అంత లీనమైపోతారు నీ ప్రతి చవితి పర్వదినానికి…
హితునిగా భావింతురు కొందరు…
స్నేహితునిగా భావింతురు మరి కొందరు…
మా ఇంటివాడివని ఇంటిల్లిపాది కొలిచేరు అందరూ…
పార్వతీ పరమేశ్వరుల ప్రియ సంతానమని ప్రేమ పంచేరందరూ…
పాహిమామ్…పాహిమామ్..శ్రీ గణనాయకా పాహిమామ్…
రక్షమామ్..రక్షమామ్..హర గణనాయకా రక్షమామ్..