గణనాయకా…ముచ్చట కొలిపే నీ ముద్దు మోముని గని మురిసెనయ్యా నీ తల్లి పార్వతీ…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

గణనాయకా…ముచ్చట కొలిపే నీ ముద్దు మోముని గని మురిసెనయ్యా నీ తల్లి పార్వతీ…
సిద్ధి వినాయకా…కనువిందగు నీ  ఆహార్యమునుగని ఆనందము పొంది దీవించెనయా నీ తండ్రి పశుపతి…
సురులందరూ ప్రస్తుతించగా…
మునుజనులెల్లరూ హర్షించగా…
జరిగేనయా నీ చవితి పూజలు….
పంచిపెట్టేరయా భక్తులకు నీ  దివ్య ప్రసాదాల  నీరాజనాలు…!!గణ!!

ఉరికేటి ఉత్సాహముతో ఊరి జనులెల్లరూ పరుగెత్తి సంతకు పట్టుకొచ్చారు నీ పూజా ద్రవ్యములు…
మా బొజ్జగణపయ్య పండగంటూ ఆడపడచులందరూ ఇల్లలికి, ముగ్గేసి ఆలపించారు స్వాగతములు…
వయోబేధాలు విడిచిపెట్టి ఊరి వారందరూ ఒక్కటై…
వర్గవిబేధాలు మూటగట్టి వారంతా ఏకమై…
కలిసి చేస్తుంటే పందిళ్ళలో నీ పండగ సందళ్ళు…
చూడ చాలవయా…విఘ్నేశ్వరా మాకు ఈ రెండు కళ్ళు…
జరగాలి ప్రతి చవితికీ నీకు ఈ వైభవములే….
చెప్పుకోవాలి…పండగంటే వినాయకచవితి పండగేనని   యుగయుగములే…

పాహిమాం..పాహిమాం..శ్రీ సిద్ధి గణపతి పాహిమాం…
రక్షమాం…రక్షమాం..దృష్టి గణపతి రక్షమాం….

Leave a Comment

Scroll to Top