ఓం నమః శ్శివాయ నమః
కనరా శివా..కనరారా శివా..
ఇలపైన నీ శివరాత్రి వైభవాలు..
దిగిరా శివా…దిగి రారా శివా…
మా పూజలందుకొని చేయగా ఆనందతాండవాలు…
తొలి సంధ్యతోనే ఆరంభమాయె శివా నీ పూజలు…
మలిసంధ్య దాకా సాగేనయా శివా నీ సేవలు…
పచ్చని పందిళ్ళతో వెలిసెనయా శివా నీ ప్రాంగణాలు…
విచ్ఛిన పూదండ లతో మురిసెనయా శివా నీ మందిరాలు…
పాలపొంగళ్ళ పూజలు,అన్నదానాల సేవలు…
అలరారెనయా శివా..నీ ఆలయాలు..
కలిమి లేములెరుగని మనసులు,కలియతిరుగుతూ జనములు..
కలిసి పూజించెనయా శివా..నీ భక్తుల హృదయాలు…
కళ కళ లాడుతున్నాయి శివా…నీ దేవాలయాలు భక్త జనుల పిల్లాపాపలతో…
మిలమిలా మెరిసిపోతున్నాయి శివా..నీ గుడి గోపురాలు.. వెలిగించిన దివ్య దీపాలతో…
మేళ తాళాలు మార్మోగుతూ మిన్నంటూతూ ఉంటే ఓ వైపు…
శంభో శంకరా…హర హార మహదేవ్ అంటూ భక్తులు ఉర్రూతలూగుతుంటే ఓ వైపు….
గుడిలోన జరిగాయి శివా…నీకు రుద్ర, క్షీరాభిషేకాలు…
ఆ తడిమేని లో నిను చూసి మా మది పలికాయి శివా..నీ దివ్య శ్లోకాలు..
వెలిగిపోతోంది శివా విశ్వమంతా నీ దివ్య క్షేత్రాల వెలుగులతో…
వేచిఉంది శివా..లోకమంతా లింగోద్భవ సమయాన నిను కోర రక్షింపమని వేయి కళ్ళతో…
పాహిమాం..పాహిమాం..శివశంకరా…
శివరాత్రి జాగారా ఫలమియ్యరా అభయంకరా…