ఓం నమశ్శివాయ: నమః
కన్నప్ప పై ప్రేమ చూపించ వస్తివా శివా…
కోయదొరలా మమ్ము కరుణించ వస్తివా శివా…
ఆ భక్త మహనీయుడు ఆదర్శమాయే మాకు….
నీ మదిని గెలుచు మార్గమ్ము చూపు దిక్సూచి గా మిగిలె మాకు…
రుధిర నయనాలతోనున్న నిను చూడలేక
తన కళ్లనే నీ కళ్లు గా చేసిన పరమపావనుడతడు….
అశ్రునయనాలతో నిను వేడుకుంటూ..
తన చూపునే నీ చూపుగా చేసుకో
మ్మని ప్రార్ధించిన ధన్యుడతడు…
కారణజన్ముడతడు శివా…
నీకరుణతో కైవల్యము పొందెనతడు శివా…
కాల గర్భాన కలిసిన నీ ప్రియ భక్తి మణిమాణిక్యమతడు…
తరతరాలు తలచుకొనె చరితను వ్రాసుకున్న అమవసెనెరుగని చంద్రుడతడు…
సరితూగ గలమా శివా మేము తనతో…
మము చూడకయా శివా ఆ భావనతో..
మనసారా ప్రార్ధించగలము శివా నిను మేము భక్తితో…
మా దిక్కు నువ్వని అర్థించగలమయా శివా..నిను మేము ఆర్థితో…
మనసెరిగి మసలుకొని మము కావరా మల్లికర్జునా….
స్వీకరించరా శివా..వినమ్రత తో నీకర్పించిన ఈ పద నివేదన…
పాహిమాం…పాహిమాం…శంకరా…
రక్షించరా శివా…రక్షించర..హరహరా…