చాలునా శివా చాలునా ఈ రెండు కళ్లు…

చాలునా శివా చాలునా ఈ రెండు కళ్లు…
సుందర సుకుమార సహస్రాక్షా నిను చూడ సరిపోవునా శివా ఈ రెండు కళ్లు..
శివరాత్రి సంబరాన అంబరాన్నంటేటి ఆనందా సమయాన సుందరేశా నిను చూడ.. కావాలి శివా మాకు వేయి కళ్లు..

మధుర ఫలముల మాలలతో..
సుమనోహర పూల దండలతో..
ధగ దగా మెరిసేటి మణిమాణిక్యములతో…
తళ తళ మెరయు తళుకుల పట్టు వస్త్రాలతో…
సుమంగళకరమౌ నీ పద్మనయనముల నుండి ప్రసరించవయా శివా.. సరికొత్త కాంతి పుంజములను…
అద్వితీయమౌ లింగోద్భవ దినమున ప్రాసాదించవయా శివా…కొంగ్రొత్త జీవితములను….
సువర్ణ మణిమయ కిరీట ధారీ…
మా బంగారు తండ్రీ…
ఈ శివరాత్రి పూట నిను పూజించుకునే వరమిచ్చావు ధన్యోశ్మి తండ్రీ…
పిలిపించుకొని అభిషేకములు చేయించుకున్నావు తండ్రీ…
అడిగించుకొని నైవేద్యములు ఇప్పించుకున్నావు తండ్రీ….
ఎందుకురా శివా…మా మీద నీకింత ప్రేమ…
రవ్వంత భక్తికే మా కింత వరమా…
పాహిమాం…పాహిమాం..శివా…
పలు పలు మార్లు నిను దర్శించు వరమియ్యారా శివా…

 
 

Leave a Comment

Scroll to Top