కనిపించరావయ్య శంకరా… కలనైన ఒక్కసారి..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

కనిపించరావయ్య శంకరా… కలనైన ఒక్కసారి..
మము దీవించరావయ్య తలచుకున్నప్పుడల్లా ప్రతిసారి…
మంగళాకార రూపమున మా కలలోన సాక్షాత్కరించు…
నిదురలో కూడా నీధ్యాసలో తరియించు మా మదిలోన నీ దివ్య సుందర విగ్రహమును ఆవిష్కరించు..!!కనిపించ!!

కొండకోనల కోయజనమైనా…
గ్రామ సీమల పల్లె జనమైనా…
ఏ వయసువారైన..ఏనగర వాసులైనా..
ఒక్కరంటె ఒక్కరేమిటి శంకరా…
ఒక్కరైనా నిను తలవని వాడు దొరకడేమిటి శంకరా…
అంతలా మాయ చేశావు..ఈ జగమును…
 అంతలా ముంచేశావు నీ భక్తిలో ఈ జనమును….!!కనిపించ!!

రాటుదేలకపోయినా ఏ ఒక్కరూ నీ సేవలో…
పొరపాటునైనా మరువరయ్యా ఏ క్షణములో….
నీ మనసు గెలవాలనే వుంటుంది…ప్రతి ఒక్కరికీ…
పార్వతీ సమేతముగా మీ దీవెనలు పొందాలని వుంటుంది…ప్రతి ప్రాణికి..
కృషిచేస్తూనే ఉంటాము..ఋషులమై నిను స్తుతిస్తూ…
విశేష ధ్యానములు  చేస్తూనే ఉంటాము..మునులమై నిను జపిస్తూ…!!కనిపించ!!

పాహిమామ్… పాహిమామ్.. శివశంకరా… పాహిమాం..
రక్షమామ్..రక్షమాం..అభయంకరా.. రక్షమాం..

Leave a Comment

Scroll to Top