బ్రహ్మ కైనా సాధ్యమా శివా సృష్టించి సాక్షాత్కరింప నిను ఇన్ని రూపాలలో..
అపరబ్రహ్మలై అవనిపై భక్తితో సాక్షాత్కరింప చేస్తున్నారు భక్తులు ఇలపైన నిను వివిధ రూపాలలో..
వరమియ్యగా ఒదిగిపోతావు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపాన…
నీ పరమవ్వగా మాధ్యాస కల్పించిపోతావు ఆశ మాలోన..
ఎంత యోచించినా తెలియనిదొకటే శివా..
ఎటులైనా నీవైపు మము నువ్వు మలుచుకొనుటొకటే శివా…
తెగని బంధాలు వేసి మా హృదయాలు తడిమి పోతావు శివా….
మా ఎదలోన నీ రూపు నిలిపి పోతావు శివా…
మా గుండె గుడి చేసిపోతావు శివా…
ఆ గుడి దీపానికి ఊపిరవుతావు శివా…
దీవించవయా శివా…వెలుగుతూ ఉంటాము నీ కరుణలో…
కరుణించవయా శివా…వెలుగులు పంచుతూ వుంటాము నీ ప్రేమలో..
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…