ఓం నమః శివాయ నమః
కంటిమయ్యా మనసార సాంబ మూర్తి…
నింపుకుంటిమయ్యా మనసులో సౌందర్య మూర్తి….
ఉండిపోవయ్య గుండెలో ప్రతి రూపమై కదలాడక….
తోడుండిపోవయ్య ప్రాణమై ఈ జీవితో కట్టకడదాక కాదనక…!!కంటి!!
శంకరా…అరవింద నేత్ర వదనా…
ఈశ్వరా…శుభయోగ కరుణ నయనా….
ఏ పాటి జన్నమిది వర్ణించ నిన్ను…
సరితూగగలనా నేను కీర్తించ నిన్ను…
అయిననూ ఇచ్చేవు వరములెన్నైననూ…
క్షణములో తీర్చేవు చింతలెన్నున్ననూ…!!కంటి!!
ఏ క్షణములో పుట్టునో నీ పైని భక్త్యానురాగము…
ఆ క్షణము నుండే అవునయ్య మా జన్మ చరితార్థము…
కనులు తెరిచిన మనసు శివ శివా అని అనకుండునా…
మనసు తెలిసిన తనువు హరా హరా అని సాష్టాంగ పడకుండునా…
దాసోహమని దరిచేరదా ఈ దేహము…
శివోహం అని అర్పించదా తనదైన మోహము…!!కంటి!!
పాహిమాం…పాహిమాం….పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం..