రుద్రాక్ష ప్రియ శంకరా…

ఓం నమః శివాయ నమః 

రుద్రాక్ష ప్రియ శంకరా…
నీ పాద ముద్రలను పూజించనీ…
అసమాక్ష శంభో హరా…నీ పద సేవలో నన్ను తరియించనీ..
భక్తితో పాడేదను కీర్తనలు వేలు…
ఆర్తితో వేడేను ఇక ఈ జన్మ చాలు..!!రుద్రాక్ష!!

కోసుకొచ్చీ వనములో నీ పూజకై పువ్వులు….
భక్తితో తీసుకొచ్చి ముదముగా మారేడు దళములు…
ఆశీనుడనై నీ ముందు అష్టోత్తరములు చదువు చుండగా…
సుఖాశీనుడవై ఆలకిస్తూ దీవెనలు ఒసగు చుండగా….
పులకించదా..ప్రతి జన్మ శివుడు కరుణించి నాడనీ…
మనసు స్మరియించదా…పలుమార్లు  హృదయ టద్దమున హరుడు కనిపించినాడనీ…!!రుద్రాక్ష!!

మాటల కందనీ భావాలు నాలోన కోకొల్లలు…
శంకరా…నిను పొగడ సాహితీ సంపదలకు లేవురా కొదవలు…
ఆశీస్సులివ్వరా…అర్పించగలను భక్తి పద కవితా కుసుమాంజలి…
అనుభూతుల నివ్వరా…సమర్పించ గలను సద్భక్తి తో వ్రాసి నీ భక్తి గీతాంజలి…
సకల జనులెల్ల పలుకునటుల…
సకల లోకము లెల్ల పాడుకొనునటుల…!!రుద్రాక్ష!!

పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా పాహిమాం
రక్షమాం…రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top