ఓం నమః శివాయ నమః
వరములడగవు ఎందుకని నన్నడగకయ్యా శివ శంకరా…
కావలసినవన్నీ అడగకనే నాకిస్తువుంటే ఏమడగనయ్యా పరమేశ్వరా….
తెలిసియో..తెలియకో నిను నేను కొలిచినది తక్కువేమో గాని…
నా మనసు తెలిసీ కూడా నువ్విచ్చినది నాకు ఎక్కువే నని చెప్ప నీ పాదాలు తాకని…
మరువగలనా శంకరా…
క్షణమైనా నిను మరచి మనగలగ గలనా ఈశ్వరా…!!వరము!!
కలవు నీవని నమ్మి కొలుచు వారెందరో…
కలలు నిజముగా చేసి కరుణించునను వారు ఎందరో….
అందరూ నీ బిడ్డలేనయా శివా…
కష్టాల కడలిలో మునిగి పోతున్నారు చేయందుకోవా!!వరము!!
యధావిధిగా చేయనంది మనసు నీ పూజలు…
ఎంతో భక్తితో చేతునంది నీ సేవలూ వ్రతములు …
గుండె తలుపు తట్టితే పలుకునటుల ఓంకారము….
మా జన్మ పరివర్తనము చెందునటుల దిద్దాలి శ్రీకారము..!!వరము!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…