ఏమున్నదో శంకరా.. నీ చూపులో

ఏమున్నదో శంకరా.. నీ చూపులో
మునిమాపునే వస్తావు మా కలలలో..
బ్రతుకు పోరాట క్రీడలో అలిసిపోయేటి ఈ జీవితాన్ని..
ఊరడించినట్లుంటావు nindaaraa నిదుర పొమ్మని..
తొలిఝామువరకు తోడునేనుంటానని..
మలిఝాము వేళ మరల వస్తానని !!ఏమున్నదో!!

రాతిరయ్యక నీ చేతులలోకి తీసుకొని  మా ప్రాణము..
తెలవారినాక తిరిగి మాకిచ్చి వేస్తావు గెలవమని బ్రతుకు రణము..
పోరాడి పోరాడి ఓడి పోతాము చివరకు…
ధర్మబద్దులు కాని జన్మలకు ఓటమే కదా dakkedi కడకు…!!ఏమున్నదో!!

పాప పంకిలమైన ప్రపంచmidi..
ప్రక్షాళన చేయవయా శంకరా…
ప్రతి జన్మకొక పరమార్ధముంటుందని మమ్మెరగనివయా హర హరా…
పుడమి పై ఫరిఢవిల్లాలి మానవత్వము..
ప్రతి ప్రాణి హృదయాన వికసించాలి ప్రేమతత్వము…
వసుధైక కుటుంబమై విలసిల్లాలి విశ్వము…
సృష్టి స్థితి లయకారుడా నీవే కదా శంకరా…మాకు సర్వస్వము…

పాహిమామ్…పాహిమామ్.. పరమేశ్వరా… పాహిమాం..
రక్షమాం..రక్షమాం.. సర్వేశ్వరా.. రక్షమాం..

Leave a Comment

Scroll to Top