ఓమ్ నమ:శ్శివాయ నమ:


నిను కాన వచ్చామయా శ్రీ కాళలింగేశ్వరా..
వేడుకొన వచ్చామయా శిప్రానదీ తీర సర్వేశ్వరా..
తెచ్చామయా నైవేద్యముగ తీపి ఫలహారములు..
ప్రార్ధించి చేసుకొన పాప పరిహారములు…!!కాన!!
భరతభూమిన భస్మాభిషేకప్రియుడివై వెలసినావు
దర్శించుకొన వచ్చిన ప్రతి హృదయాన నీ రూపమే నిలిపినావు..
ఇంకెలా మరువగలరయా శంకరా… నీప్రేమని
అంకెలలో ఎలా చెప్పగలమయా తలచుకుంటుంటాము రోజుకిన్నిసార్లని..!!కాన!!
ప్రభాత వేళనే సుప్రభాతములు పాడి నిదుర లేపేరు పూజారులు..
సర్వదోష పరిహారార్ధము వేడుకొన వచ్చారని వేల పరగణముల నుండి భక్తులు.
మమ్ము తరియింప చేయ, చేసి నీకు అలంకరణలు..
దర్శించిన మా కనులలో ఆనందము చూసి, చేసిరి విభూతి ప్రసాద వితరణలు…
పాహిమామ్.. పాహిమామ్..పరమేశ్వరా..పాహిమామ్.
రక్షమామ్..రక్షమాం…సర్వేశ్వరా