ఓమ్ నమ:శ్శివాయ నమ:


అడగమా శంకరా…ఒక చిన్న వరమును…
చాలించు నీ ఉగ్రరూపమను చిన్న కోరికను…
మానవ మాతృలము..నిను ఈ రీతిగా దర్శించుకొని తట్టుకొగలమా..
అల్పజీవులము..సాహసించి నీ ఎదుట నిలువ తరమా…!!అడ!!
బాధాతప్త హృదయులమై ఉపశమనము పొంద నీ చెంత కొస్తాము…
శోక తప్త నయనాలతో నిను వేడుకొన భక్తి శ్రద్ధలతో తరలి వస్తాము…
దర్శించుకుంటే చాలు ఒక సారి నిన్ననీ…
వేయి ఏనుగుల బలమిచ్చు వరదాయకుడివి నువ్వనీ…
గంపెడాశతో కదలి వచ్చాము హిమగిరి దొరా…
గంభీర వదనముతో నువ్వుంటే వరమెట్లుటడిగేది.. గంగాధరా…
శాంతించరా శంకరా…
నీ కరుణ కాంతులను ప్రసరించరా హర హరా…
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం…రక్షమామ్..సర్వేశ్వరా