కొలిచాడు శంకరా…ఆనాడు నిన్ను కోదండరాముడు….

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

కొలిచాడు శంకరా…ఆనాడు నిన్ను కోదండరాముడు….
నిత్యమూ నిను తలచాడు హర హరా అంటు…ఆ లంక రావణుడు…
ఎవరినైనా దయతలచు ఓ నీలకంఠా…
దయచూస్తే చాలయా మము కూడ  కాస్త  ఓసారి నీ ఓరకంట..!!కొలిచాడు!!

తిలకించితే చాలు.. తెల్లనీ నీ విభూథి నామాలు…
దొరికినట్లే వారికి పుణ్యసంపదల చిరునామాలు…
దర్శించితే చాలు..నీ నుదిటిపై ఆ ఎర్రనీ కుంకుమ బొట్టు…
ఎక్కినట్లే వారు నీ సేవలో తరించగ ఒక్కొక్క మెట్టు…!!కొలిచాడు!!

జాలిగల జంగమయ్యవు నువ్వయా..
జోలె పట్టి ఎవరు ఏమడిగినా ఇస్తావయా…
హద్దులుండవు శివా నీ ప్రేమకి…
సరిహద్దులెరుగని నీ భక్తుని    భక్తికి…

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా..పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా  రక్షమామ్…

Leave a Comment

Scroll to Top