ఎండు ఫలములనద్దుకొని వెండి కొండలవాడు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఎండు ఫలములనద్దుకొని వెండి కొండలవాడు…
ఎంత చక్కగున్నాడమ్మ అడ్డ నామాలవాడు…
సౌందర్యమే తన స్వంతమైన హైమావతీ వరుడు…
శుభ దృష్టి తో చూస్తున్న భువిజనుల మారేడు….
విచ్చేసినాడమ్మ ఉజ్జయినికీ…
దర్శించుకొనమని వచ్చి మన ముందుకి…!!ఎండు!!

తన కళ్లముందున్నాయి ఎన్నెన్నో తీపి ఫలములు….
కానీ..ఇష్టపడతాడు గైకొనగ మన ఖర్మ ఫలములు…
పాటించితే chaalu మీరు సత్య,ధర్మాలు…
నాకెందుకంటాడు నిత్య,నైవేద్యాలు…
ఎప్పుడూ కోరేను తాను మన లోన చూడాలని మహర్షిని…
గమనించు తానెపుడూ ఆ రీతిలో చేస్తున్న మన కృషిని..
ఆ త్రోవలో పయనించు హృదయాలలో నివసించునంటాడు శివుడు…
తన సేవలో తరియించు వారి తలరాతనైన మార్చగలనంటాడు హరుడు….

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top