హరా…శంకరా…సాష్టాంగ ప్రణామములు నీకు సర్వేశ్వరా..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

హరా…శంకరా…సాష్టాంగ ప్రణామములు నీకు సర్వేశ్వరా..
భవహరా..చాలించరా ఉగ్రరూపమును పరమేశ్వరా…
సాధ్యమా శివా…మాకు నిను శాంతి పరచ…
మేము తగుదుమా శివా…నీ మనసు చల్లబరచ…!!హరా!!

రారండి…రారండి…ముక్కోటి దేవతల్లారా…
వేడుకొన రారండి ముక్కంటి ప్రియ భక్తులారా…
ఏ రీతిలో కొలుతురో ఆ శంకరునిని…
శలవియ్యండి…ఉపసంహరించుకొనమని తన రూపుని…
చింతలను చెప్పుకొన వచ్చిన చిరుజీవులము…
చిరునవ్వు కరువైన తన మోముని మేమెట్లు కనగలము…!!హరా!!

ఆశ్రితవత్సలుడు ఆనందముగ లేకుంటే….
ఆపధ్భాందవుడు ఆగ్రహముగ వుంటే..
ఆగిపోదా కాల చక్రము ఏ నిముషమైనా…
విరిగిపోదా మా బ్రతుకు చక్రము తన కోపము క్షణికమైనా…
ఆలపించండి..శ్లోకాలు,స్తోత్రాలు ఆగకుండా ఎన్నెన్నో సుమధురముగ…
మ్రోగించండి ఢమరుకనాదములు ప్రసున్నడవునట్లు ముమ్మరముగా..
నర్తించ కదలిరావాలి శివుడు నటరాజుగా…
కురిపించ రావాలి మాపైన తన ప్రేమ వెన్నెల కిరణాలు నెలరాజు లాగా..

పాహిమామ్…పాహిమామ్..శివశంకరా.….
అనుగ్రహించవయా….అభయంకరా

Leave a Comment

Scroll to Top