ఓంనమఃశ్శివాయనమః


పూదండకిస్తివి ఎంత భాగ్యము
నీ అండ చేర తను పొందె యోగ్యము..
కదళీలకిస్తివి మోక్షము…
నివేదనై అవి పొందె కాటాక్షము…
సకల శుభములనిచ్చు శివుడా…
సుందరముగ నున్న నిన్ను చూడ..
తరలి రావా జగములన్నీ నిన్ను కొలువ భక్తి తోడ…
కానరాని దైవము..
కళ్ళెదుట నిలిచి కటాక్షించిన చాలు క్షణము…
కనులవిందగు నీదు రూపము…
మా హృదయపుటద్దమున స్థిర పడితెచాలు జన్మ ధన్యము…
మా తనువులో అణువణువులో ప్రాకిపోనీ నీ దివ్యమంత్రపు ధారలు…
ఈ మేనిలో ప్రతి నరములో ప్రవహించనీ ఓంకార నాదపు ఝరుల సురలు…
పరవశము తో నీ వశము కామా..
పరమేశ్వరా…నీ సేవలో మమేకమవమా…
పాహిమాం…పాహిమాం…గిరిజాపతి దేవాయా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..రుద్రరూపాయ రక్షమాం…