గుడిలోన పూజలందు కొను లింగమా…

ఓం నమఃశ్శివాయనమః🙏🙏🙏

గుడిలోన పూజలందు కొను లింగమా…
మా హృదయాన నివసించు జంగమా..
ఓంకారమే నీ రూపమై…
ఆ శబ్ద సౌందర్యమే నీకు మోదమై…
అవతరించవయా అవని పై  ఆదిశంకరా..
వినితరించమన్నావయా  శివశంకరా…

పంచాక్షరీ మంత్రాలు పంచామృతాలు…
పద నివేదనలకు ప్రధమ సోపానాలు..
పలికితే చాలు పావనమగును జన్మము..
స్వరము కలిపితే చాలు ధన్యమగును ప్రాణము…
ఓం కార నాదమే నిత్యమై సత్యమై..
విని తరిస్తోంది శివా లోకమే…ప్రాణమై దైవమై…

పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా…

Leave a Comment

Scroll to Top