కనుముక్కు తీరును కనువిందుగా తీర్చేరు…

కనుముక్కు తీరును కనువిందుగా తీర్చేరు…
కాత్యాయనీ పతిని కనులముందుంచెదరు వారు…
కఠిన శిలలో  కూడా పరమశివా నిను   చూపేరు వారు…
 కఠినమైన మా మనసులని భక్తి మార్గమున దింపేరు వారు…
విప్రులు కారు వారు…విశ్వనాధా నువ్వు పంపిన నీ దూతలు వారు…
రోజుకో రూపాన నిను తీర్చగ త్రినయనా…ఉజ్జయినీ క్షేత్రాన నివసించు భక్తి ప్రదాతలు వారు…

నిశితముగ నిను దర్శించ నిశ్శబ్దమవును మనసు…
భక్తి పారవశ్యమున తనకి తాను మరచానని తనకు తెలుసు…
మా ఉచ్ఛ్వాస నిశ్వాసములలో వినవయ్య శివా…పలుకుతుంటాయి నీ పంచాక్షరీ మంత్రాలు….
నిజమిది నమ్మవయా శివా…మా మనసు లెరుగవంటున్నాయి ఏ మాయ మంత్రాలు…
వస్తూనే ఉంటాము శివా..నిను దర్శించగా వంద ఏళ్లైనా…
శక్తినిస్తే చాలు శివా..నీ సేవ చేసుకుంటాము ఎన్ని నాళ్లైన….

పాహిమాం..పాహిమాం..శివశంకరా…
పరమ పావన మైన నీ పద కీర్తనలు పలుకు వరమియ్యరా హరా..

Leave a Comment

Scroll to Top