ఓం నమః శివాయ నమః
ఆచరింతుమయ్యా గణపతీ…
నీ బాట అనుసరింతుమయ్యా..గణపతి
పూజించి శివ పార్వతుల దీవెనలు పొందినటుల…
నిను కూడా పూజించి పొందమా దీవెనలు మేమైన అటుల…!!ఆచరి!!
వ్యాస మహామునికి బహుళ ప్రియమైతివి..
మహా భారతమును వ్రాసి చరిత కెక్కితివి…
దంతమును ఘంటముగ చేసుకొంటివి ..
నిరాఘాటముగ రచయించి ఘనత కెక్కితివి…
ఏక దంతా నీకు నీవే సాటి గణపతి…
వక్రతుండ లేరు లేరయా నీ సాటి గణపతి…!!ఆచ!!
గౌరమ్మ గారాల సుతునివై…
గజానన నామ విధేయుడవై…
ఆది దంపతులతో పెంచికొనినావు అనుబంధము…
పార్వతీ పరమేశ్వరులతో కలిసి. పంచుకున్నావు ప్రేమానురాగము…
అపురూపమైనది తలిదండ్రులు లతో నీ అనుబంధము…
ఎవరికీ,ఎప్పటికీ దొరకనిది మీ ప్రేమానురాగము…!!ఆచ!!
పాహిమాం…పాహిమాం…గననాయకా..
రక్షమాం…రక్షమాం.. శుభదాయక రక్షమాం…