తీరేను శంకరా.. కలలు ఎవరికైనా

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

తీరేను శంకరా.. కలలు ఎవరికైనా
కొలిచితే నిను మనసారా గుడిలోన..
వీడేను  కష్టాలు ఎన్నైనా
పలికితే నీ నామ స్మరణాలు శృతిలోన..
ఆనతియ్యరా అర్చనలు చేయగా…
స్వీకరించరా హారతులు ఋణము తీరగా..!!తీరేను!!

వైవిధ్యమైనట్టి నీ దివ్య రూపము ప్రసన్నము చేయ…
ఎన్ని నైవేద్యములైన చేయ సిద్ధమయా…
అసాధ్యమైనట్టి నీ మదిని చేర సుసాధ్యమవగ ఎన్ని తపములైన చేయ సంసిద్ధమయా…
ఇస్తేనే చాలయా శంకరా..ఆ శక్తిని
నిరూపించుకోమా చూపించి…నీపైన భక్తిని !!తీరేను!!

నానా విధ ఫల పుష్పముల ఆహార్యముతో..
నభూతో న:భవిష్యత్ అన్నట్లున్న సౌందర్యముతో…
శ్రీ కాళలింగాన..కాలభైరవునివై
ఉజ్జయిని పుర వీరభద్రునివై…
వీరత్వమొలికించు నీ మోముతో..
ధీరత్వమునివ్వరా…పోరాడ మాలోని దుర్గుణములతో ..!!తీరెను!!

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా పాహిమామ్…
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం

Leave a Comment

Scroll to Top