ఓం నమః శివాయ నమః
ధన్యుడనైతిని జంగమా….
లింగాన నిను కనుచూ.. దైవమా….
వినవయ్య.. పలికేను నా
ఎదలోయలలో నీ ఓంకార నాదము…
కనవయ్య…తడి కళ్ళతో ప్రార్దనలు చేస్తోంది ఈ దేహము…!!ధన్యుడ!!
కరుణిస్తావని ఆశుంది ఈ ప్రాణానికి…
కలలు నిజము చేస్తావన్న నమ్మకమున్నది నా మనసుకి..
ఏమరుపాటుగనైనా నా వేదనను వినవయ్య శంకరా…
పామరుడిని…నే కట్టిన స్వర జతుల బాణీల నివేదనకు స్పందించవయ్య హర హరా…!!ధన్యుడ!!
యాదృచ్ఛికముగనో, నీ కరుణ మూలానో నా ధ్యాస మళ్లింది శంకరా….నీ వైపుకి..
గత జన్మ ఫలమో, ఏనాటి వరమో లాగింది భవహరా… నా మదిని నీ పద సేవకి…
కనుమూసినా నీవే… కనుతెరిచినా నీవే…
నా లోకమే నీవైననపుడు శంకరా… ఇక ఏ వరము లేలయా పరమేశ్వరా…!!ధన్యుడ!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా