ఓం నమః శివాయ నమః
కలగనని రూపాన కరుణించ…కాత్యాయనీ పతి…
దీవించ దివి నుండి దిగి వచ్చినావా గిరిజాపతి…
నమో వాక్కములయ్య నీకు నాగేశ్వరా..
సదా నిను మొక్కు భక్తులము సర్వేశ్వరా…!!కల!!
ఆవాహనము చేశారు.. అర్చకులు కాళ లింగమున నిన్ను శివ శంకరా..
వరమిచ్చు వృద్ధ మల్లికార్జునుని దర్శించుకొని.. ధన్యులవమంటూ గంగాధరా…
ఫల పుష్ప శోభితమైన పరమేశ్వరా నిను గాంచినాక…
ఏ ఫలమాశించకనే శిరమొంచుఈ తనువు కానరా భక్త పరిపాలకా…!!కల!!
సాగిలపడి పోవునయ్య శంకరా…జగములన్నీ నీ ముందర…
నీ దివ్య మంగళ రూపమును తిలకించి ఆర్ధ్రతతో అర్థించెదరయ్య శంభో హరా…
శంఖాల, ఢంకాల నాదములు వినిపిస్తూ…
కోట్ల గొంతుకుల… పద ఘట్టనలతో “ఓం నమఃశివాయా” అని ఆలపిస్తూ….
తన్మయత్వము చెందేరు శంకరుని పరి పూర్ణ భక్తులైనటుల…
పరవశము చేందేరు…తమ జన్మ
ధన్యమైనటుల…!!కల!!
పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్ష మాం….