ఓం నమః శివాయ నమః
పరమేశ్వరా…పరికించరా…
ప్రారబ్ధ కర్మలు వెన్నాడుతున్నాయి రక్షించరా…
సర్వేశ్వరా…మన్నించరా…
ఏనాటి పాపాలో పగబట్టినట్లున్నాయి దయ చూడరా ..
చాలయ్య…చాలు ఈ జన్మకు…
వలదయ్య..వలదు మరు జన్మ వరకు…!!పర!!
అలుముకున్నాయి
కారుమబ్బులై కర్మ ఫలములు మాలోపల…
బహిర్గతము కానీయ్యక అడ్డు పడుతున్నాయి…భక్త్యానురాగము
పోరాడలేకున్నాను శివశంకర….
నీ పాదములపై బడి వేడుకుంటున్నాను కర్మ ఫలముల మబ్బు తెరలను తొలగించి
కరుణించరా..!!పర!!
తొలి జాము నుండి మలి జాము వరకు….
నిదుర లేచిన నుండి నిదరోవు వరకు…
నీ ధ్యాస లోనే నను మనగలగనీ…
నీ సేవా పరాయణుడనై జీవన యానమును సాగించనీ…
అపర భక్తుడనవ్వనీ శంకరా…నీ ఆశీర్వచనముతో…
అపర్ణా దేవి దీవెనలనివ్వాలి చిరునవ్వుతో…!!పర!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా..
రక్ష మాం…రక్ష మాం..సర్వేశ్వరా .