ఓమ్ నమ:శ్శివాయ నమ: 


కాళ లింగమా..నీకు కను,ముక్కు తీర్చగనే క్షణములో కనులముందుండి పోతావు శివుడివై..
మా ప్రాణలింగమా… మాకు వరములియ్యంగ బిరబిరా సిద్ధమై పోతావు హరుడివై..
చూడవసలు మా లోన కులము,గుణము,.
మమ్మడగవసలు ఏ కాసులు,రత్నాలు,కనకము…!!కాళ!!
“ఓం నమ:శ్శివాయా” అన్న స్వరము వినసొంపుగా ఏ నోట విన్నా ఇంపుగా నువ్వింటువంట…
“శంకరా..శివశంకరా” అని నీ కరుణ కోరి వడివడిగ అడుగులేస్తూ నీ తిరునాళ్ళకొచ్చే గుంపులే నీ కిష్టమంట…
ఆ పిలుపుకే పరవశమవుతావు పరమేశ్వరా…
ఆ తలపులోనే మురిసి పోతావు సర్వేశ్వరా…!!కాళ!!
ఋషి పుంగవుడను కాను…
రుద్రాక్షమాల జపములెరుగను…
వేదపండితుడను కాను…
వేదములను వల్లించలేను…
కరుణించమని కళ్ళతో ప్రార్ధించగలను ఎన్ని సార్లైనా..
మన్నించమని మనసారా వేడు కొనగలను తప్పులెన్నున్నా..
పాహిమామ్. పాహిమామ్..శివ శంకరా పాహిమామ్
రక్షమామ్..రక్షమామ్..జగదీశ్వరా రక్షమామ్..