కానవచ్చె హరుడు నేడు గణపతి రూపమై….

కానవచ్చె హరుడు నేడు గణపతి రూపమై….
దీవించ వచ్చె శివుడు తన ప్రియ సుతుని ప్రాణమై…
చూడరావమ్మ గౌరమ్మ ప్రియమార నీ పశుపతిని…
చూసుకోయమ్మ గిరిజమ్మ తనలోన నీ ముద్దు గణపతిని….
మురిసిపోతావేమో చూడు…నీ మగని లో చూసి నీ ముద్దు గణపయ్యని….
దిష్టి తీసిపోతావేమో చూడు..ఏ పాడు కళ్ళేవి తనపైన పడకూడదని…
గంగాధరుడే నేడు లంబోదరుడైన వైనము….
చెప్పకనే చెబుతుంది కదా..తల్లీ….తండ్రి కొడుకుల ప్రేమ యొక్క ఘనము….

ఆది దంపతుల బిడ్డ మాకు అండగావుంటే…
ఇంకేమి కావాలి మాతా మా జన్మకు అంతకంటే…
పాహిమాం..పాహిమాం…పార్వతీ ప్రియ నందనా పాహిమాం…
రక్షమాం…రక్షమాం…విఘ్న వినాశాయ రక్షమాం…

Leave a Comment

Scroll to Top