పిలవకయా శంకరా…పడిపోతాము నీ మాయలో…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏07.11.2021

పిలవకయా శంకరా…పడిపోతాము నీ మాయలో…
మము వాడకయా నీ ఆటలో…ఓడిపోతాము క్షణములో…
బానిసలమయా మేము..నీ ప్రేమకి.
బలహీనులమయా మేము..నీ క్రీడకి..!!పిలవకయా!!

ఎంత పుణ్యము చేసెనో..నంది
నీ ఎదుటనే కూర్చుని సదా నిను దర్శించుకొనే భాగ్యమును పొందింది….
ఏ నోము నోచెనో వాసుకి…
నీ మేనిలో భాగమై నీ చెలిమి గా మారింది చివరికి…
మూగ జీవాలకే మోక్షమిచ్చిన అనురాగమూర్తీ…
రాగబంధాలలో పడవేసి రక్షించకుంటే మమ్మెట్లయా సాంబమూర్తీ…!!పిలవకయా!!

చూస్తుంటే నీ కంటి కనుపాపలను….
పొందినట్లుంది నీ ప్రేమ సంపదలను…
నమస్కరిస్తుంటే నిలుచుండి నీ రూపమును…
వెనకుండి తడిమినట్లుంది మా భుజమును..
జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని శ్రీ కాళలింగమా…
మా అంతరంగములనెరిగి మము కావు జంగమా…!!పిలవకయా!!

పాహిమాం..పాహిమామ్..శివశంకరా… పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top