ఎచట నున్నావమ్మా పార్వతీ…

ఎచట నున్నావమ్మా పార్వతీ…
చిటికెలో చేరుకొన రావమ్మ హైమావతీ….
తేరిపారా చూడరావమ్మ త్రినేత్రుడిని…
ఓరకంటితో చూడరావమ్మ సిగ్గుపడక ముక్కంటిని…!!ఎచట!!

భిన్న పుష్పమాలాంకృతుడై నీ పెనిమిటి….
విభిన్న పట్టువస్త్రాలు ధరించి ఒకదానిపై ఒకటి…
ఇక్కట్లు మరిపింప ఈశ్వరుండు…
ఇంపుగా ముస్తాబై అరుదెంచినాడు.
కానరావమ్మ బిర బిరా…
చేయక క్షణమైన ఆలస్యము కదలి రా…!!ఎచట!!

నిలిచి పొమ్మని చెప్పమ్మ ఇట్లాగే నిటలాక్షుని మాగుండెలో…
తనని కలసిపొమ్మని చెప్పమ్మ మా తనువులో…
ఏమాత్రమూ మేము తప్పటడుగులు వేయకుండా…
ఏమరుపాటున కూడ జన్మ పరమార్ధము మరువకుండా…
పయనించులాగున తన మార్గ దర్శకత్వములో మేమందరం…
సంతసాన చేసుకొనులాగున తన నిర్దేశకత్వములో పుణ్యాల సంబరం…
శలవియ్యమ్మ శంకరునికి శాంభవీ…
మా మాటగా చెప్పమ్మ భక్తజన ప్రియ బాంధవీ..!!ఎచట!!

పాహిమామ్…పాహిమామ్..గిరిజాపతీ పాహిమామ్..
రక్షమాం..రక్షమామ్..రామేశ్వర శివం…రక్షమామ్…

Leave a Comment

Scroll to Top