ఏ పూర్వ పుణ్యమో నీ దర్శన భాగ్యము….

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఏ పూర్వ పుణ్యమో నీ దర్శన భాగ్యము….
ఏ జన్మ ఫలమో నీ సేవా యోగ్యము…
కావాలి శంకరా…ప్రతిక్షణము నీ సాయము..
ఇవ్వాలి హర హరా కాదనక మాకభయము…!!ఏపూర్వ!!

కోట్లకొలది  కుసుమాలు నీ పూజకై విరగబూసేను..
నీ పాదాల చేరు శుభ సమయము యెపుడెపుడా అని పరితపించేను..
వేద మంత్రాలు పఠియింప వాక్సుద్ధి  గల పండితులు వేచి వున్నారు
మంగళ స్వర వాద్యములు వినిపింప నాద స్వర బ్రహ్మలు నిలిచి వున్నారు…
అనుమతిస్తే చాలు అందరూ ఏకమై..
నీ సేవలో సంపూర్ణముగ మమేకమై..
అత్యంత సుందర శుభమంగళకర దృశ్యమే కనులముందుంచేరు…
నీ సునయన దరహాస ప్రతిరూపమును చూపించి వ్యధలు మరిపించేరు…
కైలాసమే దిగి వచ్చి కనులముందున్నటుల…
ఆ సురలోకమే తరలొచ్చి నీ ముందు నిలిచి ఉన్నటుల…

పాహిమామ్… పాహిమామ్.. పరమేశ్వరా పాహిమామ్..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా... రక్షమాం..

Leave a Comment

Scroll to Top