ఓమ్ నమ:శ్శివాయ నమ:


ప్రభాత వేళ ప్రభాకరుని తిలకమై నీ మోము కన ఎంత భాగ్యమయా శంకరా…
శ్వేత వర్ణ ముఖారవింద రవి కిరణ కాంతి పుంజముల వెలుగులో నిను ప్రస్తుతించ మా జన్మ ఎంత ధన్యమయ హర హరా..
సప్తవర్ణములు మిళితమైన ఆ వెలుగు రేఖల సాక్షిగా…
ఒక లిప్తకాల సందర్శనముతో అభయమిత్తువు కదా ఉందునని రక్షగా…
ఆదరించే ఆర్త్రత్రాణయుడివి అన్న పదముకు అర్థముగా…
గుడిలోన కూర్చుందువు కరుణ కురిపిస్తూ గుంభనముగ…!!ప్రభాత!!
చారెడు సిరిగంధములు పూసి
చిటికెడు కుంకుమ సొగసులద్ది..
పూల మాలలు అందముగ వేసి
ఓంకార తిలకమును సౌందర్యముగ దిద్ది…
తీర్చారయా శంకరా.. భక్తులు లింగాన మేమెన్నడూ కనని ఓ రూపమిచ్చి…
కదలి రమ్మన్నారయా హర హరా..కడతేర్చుకొన కష్టాలు నిను దర్శించుకొని వచ్చి..
రూపమే లేనట్టి శివలింగమా..
ఎంత అపురూపమయ్యావు జంగమా…
పాహిమామ్..పాహిమామ్..గౌరీ సమేత పరివార శివశంకరా పాహిమామ్.
రక్షమామ్..రక్షమామ్…
ప్రమధనాదాది ప్రియ పూజితాయ శివా రక్షమామ్..