వల్లమాలిన భక్తి…వినదయ్య శంకరా నా మాట….

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

వల్లమాలిన భక్తి…వినదయ్య శంకరా నా మాట….
పలికించునెపుడూ “ఓం నమ: శ్శివాయా” అని నా నోట…
కనులు మూసుకొని ప్రార్ధించినా చాలట..నిను ఒక్కపూట…
అపన్నహస్తులని ఆదుకొని వరమిచ్చుట నీకలవాటట..!!వల్ల!!

ఆరాధనే భగవంతునికి, భక్తునికి అనుసంధానము….
సమాధానమే మా యెడల నీకున్న దివ్యానురాగము…
మరచిపోలేనట్టి నీ మహిమాన్వితమైన రూపముతో…
తడిమి చూసేవయ్య…ప్రతి హృదయ తలుపులను ప్రేమ భావముతో…!!వల్ల!!

మహోన్నతమైన ఆ కైలాస శిఖరాల లాగా…
పెరగనీవయ్య మా భక్తి శిఖరాలు ఇంకాస్త ఎత్తుగా….
విశిష్టమైన లంకేశ్వరుని భక్తికి….
ప్రశస్తమైన మార్కండేయుని యుక్తికి…
మెచ్చి వరమిచ్చినట్లే…
మము కూడా దీవించవయ్య…నీకు నచ్చినట్లే…!!వల్ల!!

పాహిమామ్… పాహిమాం.. శివశంకరా…పాహిమామ్..
రక్షమాం…రక్షమాం..అభయంకరా…రక్షమాం…

Leave a Comment

Scroll to Top