ఓమ్ నమ:శివాయ నమ:


త్రిశూల తిలకాంకృత త్రినేత్రా…
విశ్వసంరక్షక సువిశాల రుద్ర నేత్రా..
దివి లోన నువ్వున్నదొకటే నీకు కైలాసము…
ఈ పుడమి పై నీగుడి వున్న ప్రతి
ఊరూ మాకు కైలాసము..!!త్రిశూల!!
ఆకసాన్నంటేటి ఆశలేమీ లేవయా…
ఆది శంకరా నీ దయ వుంటే చాలయా…
అన్నమో రామచంద్రా..అని ఎవ్వరూ అనకుండా…
ఆకలన్నపదమే మేమెక్కడా వినకుండా..
ఆదుకుంటే చాలయా..నువ్వేగా శంకరా.. ఈ భువి జనుల అండ…
మా తోడుగుంటే చాలయా ఇలవేల్పువై బంగారు కొండా..!!త్రిశూల!!
నీ పుట్టు పూర్వోత్తరాలు మాకెవరికయా ఎరుక…
ఒట్టి పుణ్యానికే ఇస్తావు ఎవరడిగినా వరములు కాదనక…
సంధించవు ఏ ప్రశ్నోత్తరాలు మమ్మడగ…
శంకించవు ఏ మాత్రమూ మము నీ దరి చేర్చుకొనగా..
అందుకే నిన్నందురయా అందరూ భోళా శంకరుడనీ…
ఏ కష్టమొచ్చినా ఆదుకొనే దయార్ద్ర హ్రుదయుడనీ…
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా.
రక్షమామ్..రక్షమామ్..సర్వేశ్వరా రక్షమామ్..