ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఇందువారము..ఇంకొక్క క్షణమైన చేయము ఆలస్యము…
చేరేము నీ చెంత ఇవ్వరా శంకరా ఏకాదశీ శుభ తిధిన నీ దివ్య దర్శనము…
జాబిలిని ఝటమున గల జంగమా జాగేలరా…
కొప్పున గంగను గల గంగాధరా వరమియ్యరా…!!ఇందు!!
ప్రత్యేక పూజలలో పరమేశ్వరా దర్శించినాక నిన్ను….
ప్రత్యక్ష దైవమెదుటనే నిలిచామన్న భావనలు అంటాయి మిన్ను…
ఈ అనుభూతిని ఏమనము శంకరా…
దీని పరమార్ధమేమిటని ఏవరినడగము హర హరా..
అనుభవించిన నా కనులు ఆనందాశ్రువులు కార్చి ఊరుకున్నాయి…
స్పందించిన నా నవ నాడులు ఓదార్చి భక్తితో నిన్ను ధ్యానించమన్నాయి…
కాకతాళీయముగనైన కలలోకి రా రావయ్య…
కాత్యాయినిపతీ కనిపించి కరుణించి దీవించి పోవయ్యా…
పాహిమామ్..పాహిమామ్..శివశంకరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..