మీసాల సాంబయ్యా…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

మీసాల సాంబయ్యా…
మీమాంసమెందుకయా…
మిన్నిరిగి మీద పడినా..
మేము నిను వీడి పోలేమయా…
సంకోచమేలనయా సాంబయ్య…
నీ సంతానమే మేమయా..
సందేహమే వలదయా…
సద్భుద్ధితో నిన్ను కొలిచేమయా…
రావా… శివా.. శంకరా…మము గావ రావా శివాశంకరా…
శంభో హరా శంకరా…ఉమాదేవీ వరా శంకరా…!!మీసాల!!

కొమరయ్య,గణపయ్య కుడి  
ఎడమలై….
అమ్మోరితో కలిసి అరుదెంచవయ్యా…
ఆ నంది వాహనముపై మీ నల్గురూ ఆశీనులై తిరుగాడితే పుడమిపై జగము పులకించి మొక్కేనయా…
అడుగడుగునా మీకు హారతులు పట్టేరయా…
అవధులెరుగని ఆనందమున నాట్యములు చేసేరయా….!! మీసాల!!

మురిపెముగ ముమ్మారు మిమ్ము చూసేరు…
మీ ముత్యాల నవ్వుకే పొంగి పోయేరు..
కైలాసమే కదలి వచ్చిందనీ…
కోరకనే తమకు ముక్తినిచ్చిందనీ..
జేజేలు చెప్పేరు జంగమా మీకు…
జయ జయధ్వానాలు పలికేరు కాళలింగమా మీకు….
రావా శివా… శంకరా…మము గావ కదలి రావా శివా….శంకరా…
శంభో హరా శంకరా…ఉమాదేవీ హరా శంకరా…

పాహిమామ్..పాహిమామ్..శంకరా..
రక్షమామ్..రక్షమామ్..శంకరా…

Leave a Comment

Scroll to Top