ఓమ్ నమ:శ్శివాయ నమ:


కలవయ్య కలవయ్య శంకరా…
మా కలల దొరవయ్య దొరవయ్య శంకరా…
చిత్రించుకున్నాము శివశంకరా..
గుండెల్లో ముద్రించుకున్నాము మురుడేశ్వరా….!!కల!!
మరచిపోలేనెన్నటికి శంకరా..ఈ పుణ్య దినము….
మున్నూట ఇరువది నాల్గవ నీ పద కవిత రచన దినము…
కలనైన ఊహించని కానుకిచ్చావు…
నీ పద గీతికలు వ్రాయించి నన్ను ఓ చిన్న కవిని కానిచ్చావు…
పఠించినవి ఎన్నెన్నో కనులు నేను వ్రాసిన నాకు తెలిసిన నాల్గు మాటలు…
స్మరించినవి నిను తలచుకొని కురిపించమని నీ కరుణ ముప్పూటలు.. !!కల!!
రోజుకొక రూపాన నిను దర్శించుకుంటూ….
ఏ తీరుగ కవిత వ్రాయాలనుకుంటూ..
యోచిస్తూ మౌనముగ నేనుండగా…
అందిస్తూ ఒక్కొక్క పదమూ నువ్వండగా….
పూర్తికానిస్తావు కదా శివా.. నువ్వే నీపదగీతిక…
నేనెందుకవుతాను శివా… ఇంక కవినిక…
తెలియకుండానే నాచేత ఈ వ్రతము చేయిస్తున్నావు…
నేనడగకుండనే నాకింత భాగ్యమిచ్చి ప్రోత్సహిస్తున్నావు…
చెమ్మగిల్లిన కళ్ళతో చేస్తున్నాను ఈశ్వరా…ప్రమాణాలు..
ఎన్నటికీ వదలనని…పరమేశ్వరా నీ దివ్య చరణాలు….
పాహిమామ్..పాహిమామ్.. శివశంకరా పాహిమామ్…
నీ భక్తి గీతాలు ఎన్నైనా వ్రాయగల శక్తినివ్వరా శంకరా రక్షమామ్