కనులారా కనరండి శివుని బిరానా…
మనసార కొలవండి హరుని తిలకించి ఈ రీతిన…
కుసుమ కోమల సోయగముతో ఒక వైపు….
కరుణ నొసగు నగుమోము తో ఒక వైపు…
వెరశి అర్ధనారీశ్వరం…అహో..అద్భుత క్షణమిది కనగ శివ పార్వతీశ్వరం…
ఏకమేను రూపమైన మీ మేలిమి సాంగత్యము…
మమేకమైన విధము తెలుపు మీ అన్యోన్యమైన దాంపత్యం…
తల్లివై లాలించరా శివా…సగము మేనితో…
తండ్రివై పాలించరా శివా… మలి సగము మేనితో….
ఆర్తులను ఆదుకొనగా అమ్మవైనా సరే..
అపన్నులను హత్తుకొనగ అయ్య వైనా సరే…
తలిదండ్రుల ప్రేమను నువ్వే సమతూకం వేసి…
కన్నబిడ్డలనుకొని మా బాధలు తుడిచేసి…
ఏకాకులం కామని, మాతో నువ్వున్నావని…
ఏడున్నావ్ శివా…అంటే ఇదిగో నీ పక్కనని…
భుజము తట్టి ధైర్యమిచ్చు దయార్ద్రహృదయుడా…
మా చేయి పట్టి కష్టాల కడలి దాటించు దేవుడా….
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా.
పిలిచిన పలికే సర్వేశ్వరుడా…శరణురా…