దొరవురా శివా…మా దొరవురా శివా..

దొరవురా శివా…మా దొరవురా శివా..
నీ అండదండలే మాకు ఆదరవురా శివా…

మనసార నిను మ్రొక్కితే మా ఇంటిముందుంటావు మా తోడుగా…
కనులారా నిను కాంచితే కడదాక తోడుంటావు కాపాడుతూ నీడగా…
తలచింది ఎవరనీ చూడవు…
పిలిచింది ఎవరనీ తలవవు…
హుటాహుటిన బయలుదేరుతావు మము పలకరించ….
తటాలుమని వచ్చి వాలుతావు మము కరుణించ…
భక్తులంటే అంతిష్టమా శివా…
అశక్తులంటే అంత ప్రేమా శివా…
అందుకేనేమో శివా…అవని ఆరాధించకవుండలేనంటుంది ప్రతి దినము…
నీ మది గెలుచుకొనెందుకేనేమో శివా.. భువిన ప్రార్ధించలేకుండ ఉండనంటున్నారు ఈ జనము…
చిరకాలముండనీ శివా..నీ తోటి ఈ రాగ బంధాన్ని…
అచిర కాలములోనే నీ తోటి పంచుకున్న నా భక్తి భావాల్ని….
పాహిమాం..పాహిమాం..శివ శంకరా..
రక్షమాం…రక్షమాం..అభయంకరా…

Leave a Comment

Scroll to Top