ఏ రాగమని పాడను శివా…
నీ వైభవమును తెలుప నేనే రాగమని పాడను శివా…
ఏ భావమని చెప్పను శివా..
నిను కని నిశ్చేష్టుడనైన నేనే భావమని చెప్పను శివా…
నిను కీర్తించ భాష కందని భావాలు లోలోన ఎన్నో…
నిను ప్రస్తుతించ పెదవికందని నీ భక్తి పదపంకజములు నాలోన ఎన్నెన్నో…
మది భక్తిగ్రంధాలయమున నిక్షిప్తమై ఉన్నాయి వేవేల గ్రంధాలు…
పుంఖాను పుంఖాలుగా విస్తరించిఉన్నాయి శతకోటి స్కంధాలు…
ఎన్నటికీ తరగని నిధిలా దాచుకుంటాను నా హృదిలో…
నేన్నటికీ మరువక నిలిచి ఉంటాను నీ స్మృతిలో…
నిను నేను తలచునపుడు నువ్వు పొలమారితే చాలు శివా…
నిను నేను కొలిచినపుడు మా తలరాతలు మారితే అదే పదివేలు శివా….
పాహిమాం…పాహిమాం….శివశంకరా.
నీ పదపల్లవులతో లతల్లల్లి నీ పాదాల ఉంచాను కరుణించరా…