ఓం నమ:శ్శివాయ నమ:


వందే..వందే శివ శివ శంకర అన్నది నిను గని నా మది..
నీదయ పొందే క్షణమెపుడని, ఎపుడని మరి మరి నన్నడిగినది…
సుమశోభిత శశిధర బదులిడరా…
పదపూజిత పార్వతిపతి మా కల తీరెదేపుడని రా..!!వందే!!
ఎన్నో ఎన్నో వైషమ్యాలు, వైరుఢ్యాలు, మానసమందు మాలిన్యాలు…
ఇంకెన్నో ఎన్నో అంతే చిక్కని ఆశల తేనెల అనుబంధాలు..
అలలై సుడులై పోటేస్తుంటే…
నడిపే శక్తిని పిండేస్తుంటే..
ఊగిసలాడుతూ మా జీవన నావ… తేలుతు సంధ్రాన ఎటువైపో తెలియక త్రోవ…!!వందే!!
కడలిన కలిసిన కన్నీటి సాక్షిగా…
నీ పదములె దిక్కంటూ ఏడ్చింది ఒంటరిగా…
నడిపించమని చుక్కానై త్వరగా ఇంకా ముందుకు…
ఈ ఈతి బాధలనుండి బయటపడి నీ కరుణ తీరమును చేరేందుకు…!!వందే!!
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం…